కర్నూలు జిల్లా ఆలూరులో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియను తక్షణమే రద్దు చేయాలని, అర్హులైన పేద, దళిత, బడుగు బలహీన వర్గాల ఓట్లను పునరుద్ధరించాలని వామపక్షాలు సోమవారం డిమాండ్ చేశాయి. ఈ మేరకు ఆలూరు అంబేద్కర్ సర్కిల్ వద్ద పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శన చేపట్టారు. ఈ సందర్భంగా సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు అంజి బాబు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ భూపేష్ మాట్లాడారు. ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ తక్షణమే రాజీనామా చేయాలని వారు కోరారు.