అనంతపురం వన్‌టౌన్ పరిధిలో పదో తరగతి బాలికపై దారుణం చోటుచేసుకుంది. ట్యూషన్‌కు వెళ్లే బాలికను ప్రేమిస్తున్నానని నమ్మించి, నంద్యాల జిల్లా కొలిమిగుండ్ల మండలం ఎర్రగుడికి చెందిన మహేంద్ర అనే వ్యక్తి పలుమార్లు అత్యాచారం చేశాడు. బాలిక కడుపునొప్పితో ఆస్పత్రికి వెళ్లగా, రెండు నెలల గర్భంతో ఉన్నట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ ఘటనపై పోలీసులు నిందితుడిపై పోక్సో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.