బనగానపల్లె: అదుపుతప్పి బోల్తా పడిన టిప్పర్

బనగానపల్లె మండలం టంగుటూరులో శుక్రవారం రోడ్డు ప్రమాదం సంభవించింది. బనగానపల్లెకు చెందిన కృష్ణరెడ్డి టిప్పర్ గ్రావెల్ లోడ్ తో బనగానపల్లె నుంచి మహానంది వెళ్తుండగా టంగుటూరు సమీపంలో ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోయి పంట కాలువలో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ అప్రమత్తం అవ్వడంతో గాయాలతో బయటపడ్డాడు. జేసీబీ సహాయంతో గ్రావెల్ తొలగించి టిప్పర్ ను బయటకు తీసే ప్రయత్నం చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్