బనగానపల్లె: అనుమానంతో భార్యను హత్యచేసిన భర్త

బనగానపల్లె మండలం బీరవోలు గ్రామంలో భార్య లక్ష్మి (35)ని భర్త వెంకటస్వామి, అతని సోదరులు వెంకటరమణ, శ్రీనివాసులు కలిసి గాలేరు-నగరి కాల్వ వద్దకు తీసుకెళ్లి హత్య చేసి, మృతదేహాన్ని పూడ్చిపెట్టిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. భార్య మిస్సింగ్ కేసు విచారణలో ఈ హత్యోదంతం బయటపడింది. పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకుని, ఫోరెన్సిక్ నిపుణుల సహాయంతో మృతదేహాన్ని వెలికితీసి పోస్టుమార్టం నిర్వహించారు.

సంబంధిత పోస్ట్