రాయలసీమ అభివృద్ధికి చంద్రబాబు బ్రాండ్ అంబాసిడర్: మంత్రి బీసీ

మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి మంగళగిరిలో సోమవారం మీడియాతో మాట్లాడుతూ, "రప్పా. రప్పా. అంటే పారిశ్రామికవేత్తలు వస్తారా?" అని విమర్శించారు. కూటమి ప్రభుత్వంలో రాయలసీమ అభివృద్ధి వేగంగా సాగుతోందని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అభివృద్ధికి బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్నారని ఆయన అన్నారు. ప్రతిపక్ష హోదా లేని వారు విమర్శలు చేయడం సరికాదని, రాబోయే ఎన్నికల్లో గొడ్డలి పార్టీకి డిపాజిట్లు కూడా రావని ఆయన వ్యాఖ్యానించారు.

సంబంధిత పోస్ట్