మొహరంలో బంగారు గొడుగు చోరీ

అవుకు మండల పరిధిలో మొహరం వేడుకల్లో అపహరణకు గురైన బంగారు గొడుగు ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అవుకు తేరు వీధిలోని మౌలాలి స్వామికి లైలాన్ దారంతో కట్టి అలంకరించిన బంగారు గొడుగును దుండగులు బ్లేడుతో కత్తిరించి దొంగిలించారు. ఈ ఘటనపై మౌలాలి ఉత్సవ కమిటీ సభ్యులు ఆదివారం పోలీసులను ఆశ్రయించగా, పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

సంబంధిత పోస్ట్