కొలిమిగుండ్లలో భారీ వర్షం.. మసీదు వంకలో వరద ప్రవాహం

కొలిమిగుండ్ల మండలంలోని పెట్నికోట, కొండమీదపల్లె, గొర్రిమానుపల్లె, మదనంతపురం, అంకిరెడ్డిపల్లి, చింతలాయపల్లి గ్రామాల్లో శుక్రవారం మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. వాతావరణం ఒక్కసారిగా మారి కురిసిన వర్షంతో ప్రజలకు ఉపశమనం లభించింది. ముఖ్యంగా పెట్నికోట గ్రామంలోని మసీదు వంక ఈ సీజన్‌లో తొలిసారిగా వరద నీటితో ప్రవహించడంతో గ్రామస్థులు ఆనందం వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్