కొలిమిగుండ్ల మండలం ఉమ్మాయిపల్లిలో బుక్కే ఆదిలక్ష్మి అనే మహిళపై వీరాంజి నాయక్ అనే వ్యక్తి దురుసుగా ప్రవర్తించి, తీవ్ర పదజాలంతో దూషించి బెదిరించినట్లు సీఐ రమేష్ బాబు తెలిపారు. ఇంటి వద్ద ఫెన్సింగ్ వేసే విషయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. బాధితురాలి ఫిర్యాదు మేరకు నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.