కొలిమిగుండ్ల మండలం బెలుం శింగవరం గ్రామంలో భర్త మద్యానికి బానిస కావడంతో తీవ్ర మనస్తాపానికి గురైన దొమ్మరి సులోచన అనే మహిళ ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనపై మృతురాలి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ రమేష్ బాబు తెలిపారు.