బనగానపల్లె నియోజకవర్గంలోని అవుకు రిజర్వాయర్ పరిధిలోని అవుకు, సంగ పట్టణం, మెట్టుపల్లి గ్రామాల మత్స్యకార కుటుంబాలు, సంఘాలతో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సమావేశమయ్యారు. వారు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. మత్స్యకారుల చేపలవేటకు అవసరమైన వలలు, బోట్లు వంటి అత్యాధునిక పరికరాలను కూటమి ప్రభుత్వం సబ్సిడీ ద్వారా అందిస్తుందని తెలిపారు. మత్స్యకారుల అభ్యున్నతికి కూటమి ప్రభుత్వం తోడ్పాటు అందిస్తుందని ఆయన పేర్కొన్నారు.