పిన్నిసు మింగిన బాలుడు

బనగానపల్లె ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు అరుదైన చికిత్సను విజయవంతంగా నిర్వహించారు. మండలంలోని అప్పలాపురం గ్రామానికి చెందిన రాజశేఖర్, వాణి దంపతుల ఆరేళ్ల కుమారుడు షణ్ముఖ, ఆడుకుంటూ పిన్నిసు మింగడంతో తల్లిదండ్రులు ఆసుపత్రి సూపరింటెండెంట్ ఉమాదేవిని సంప్రదించారు. ఆమె శస్త్రచికిత్స అవసరం లేకుండానే బాలుడి కడుపులోంచి పిన్నిసును విజయవంతంగా బయటకు తీశారు.

సంబంధిత పోస్ట్