బేతంచెర్ల హనుమాన్ నగర్‌లో పోలకంఠ సుజాత నిర్వహిస్తున్న నాటు కోళ్ల ఫారంలో నిన్న రాత్రి కుక్కలు దాడి చేసి 181 కోళ్లను చంపేశాయి. ఈ ఘటనతో ఆమెకు సుమారు ₹2.50 లక్షల నష్టం జరిగినట్లు శుక్రవారం తెలిపారు. జీవనోపాధి దెబ్బతిన్నందున ప్రభుత్వం తక్షణ ఆర్థిక సాయం అందించాలని బాధితురాలు కోరుతున్నారు.