ఆంధ్ర ప్రదేశ్ రైతు సంఘం నంద్యాల జిల్లా 2వ మహాసభలు 2025 అక్టోబర్ 11, 12 తేదీలలో ఆత్మకూరులో నిర్వహించనున్నట్లు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు వి. సుబ్బరాయుడు, మండల కార్యదర్శి పి. రామమోహన్ తెలిపారు. ఆదివారం నాడు స్థానిక సీఐటీయు కార్యాలయంలో మహాసభ కరపత్రాలను విడుదల చేసిన వారు, జిల్లా నలుమూలల నుండి రైతులు అధిక సంఖ్యలో తరలి వచ్చి ఈ మహాసభలను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.