డోన్ పట్టణంలో ప్రమాదవశాత్తు పౌడర్ ఫ్యాక్టరీలో ఒక మహిళ మృతి చెందింది. బుధవారం డోన్ పట్టణంలోని కోట్లవారిపల్లెలో మండలంలోని ధర్మవరం గ్రామానికి చెందిన ఆవుల లోకేశ్వరమ్మ (48) అనే మహిళ పౌడర్ స్టాక్ పాయింట్ వద్ద నిలువ ఉంచిన యంత్రంలో ప్రమాదవశాత్తు పడి మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. తమను ప్రభుత్వ అధికారులు ఆదుకోవాలని మృతురాలి భర్త మద్దయ్య తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.