డోన్ లో శనివారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. డోన్ లోని శ్రీగురపేట ఫ్లై ఓవర్ బ్రిడ్జిపై పారు జానీ అనే యువకుడు కేటీఎం బైక్ పై వేగంగా వెళ్తూ స్కిడ్ అయ్యి బ్రిడ్జి డివైడర్ ని ఢీకొట్టాడు. దింతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.