డోన్: ఈ నెల 9న సీఎం చంద్రబాబు రాక

ఈ నెల 9న డోన్ మండలం కొత్తబుర్జు గ్రామంలో ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా నూతన పట్టాదారుల పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమం జరగనుంది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే కోట్ల జయసూర్య ప్రకాశ్ రెడ్డి మంగళవారం అధికారులతో సమీక్ష నిర్వహించి, ప్రజల సౌకర్యాలు, రవాణా, భద్రత, వేదిక ఏర్పాట్లపై చర్చించారు. గ్రామస్తులు భారీగా హాజరయ్యే అవకాశం ఉన్నందున తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించాలని అధికారులకు సూచనలు అందాయి.

సంబంధిత పోస్ట్