బేతంచెర్ల మండలం ఆర్. కొత్తపల్లి సమీపంలో సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఎరుకలి సుబ్బన్న (75) అనే వృద్ధుడు మృతి చెందారు. కుమారుడు నాగశేషన్నతో కలిసి ఆటోలో డోన్ వైపు వెళ్తుండగా, వెనుక నుంచి వేగంగా వచ్చిన ట్రాక్టర్ ఆటోను ఢీకొంది. ఈ ఘటనలో సుబ్బన్న తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మరణించారు. సమాచారం అందుకున్న బేతంచెర్ల పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.