ప్రభుత్వ జూనియర్ కళాశాల, ప్యాపిలికి చెందిన BiPC రెండవ సంవత్సరం విద్యార్థి అబ్దుల్ గఫూర్, జిల్లా స్థాయి ఇన్‌స్పైర్ అవార్డు పోటీలలో 'మస్కిటో ట్రాపర్' ఎగ్జిబిట్‌తో ప్రతిభ కనబరిచి రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికయ్యాడు. ఈ విజయం కళాశాలకు గర్వకారణమని ప్రిన్సిపాల్ సుబ్రమణ్యం తెలిపారు. గత నెలలో జరిగిన జిల్లా స్థాయి పోటీలలో గఫూర్ రూపొందించిన ప్రదర్శన విశేషంగా ఆకట్టుకుంది. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్, అధ్యాపకులు గఫూర్‌ను అభినందించారు.