లారీ డ్రైవర్ గిరిబాబు గుండెపోటుతో మృతి: సంతాపం తెలిపిన మోటార్ వర్కర్స్ యూనియన్

డోన్ పట్టణం శ్రీనివాస్ నగర్ కు చెందిన లారీ డ్రైవర్, యజమాని గిరిబాబు (53) మంగళవారం గుండెపోటుతో మృతి చెందారు. ఆయన స్వగ్రామం ఎర్రగుంట్ల. డోన్ మోటార్ వర్కర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి టి.శివరాం, ఇతర డ్రైవర్లతో కలిసి మృతుని స్వగృహానికి వెళ్లి, ఆయన భౌతిక కాయానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించి, గిరిబాబు ఆకస్మిక మరణం పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేశారు. గిరిబాబు డ్యూటీలో భాగంగా బళ్లారి నుండి తమిళనాడుకు వెళ్తుండగా అస్వస్థతకు గురై మరణించినట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్