పేదరికం, ఆకలిపై అవగాహన: సంక్షేమ పథకాలు పూర్తి స్థాయిలో అందించాలి - రఫి

పేదరికం, ఆకలి వెనుక ఉన్న సమస్యలపై అవగాహన పెంచడానికి పేదరిక నిర్మూలణ దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. ఆధునిక యుగంలోనూ ఆకలి చావులు వీడలేదని, మానవ జాతి ఇంకా ఆకలిని జయించలేదని సామాజిక కార్యకర్త డోన్ పి. మహమ్మద్ రఫి తెలిపారు. ప్రభుత్వాలు కృషి చేస్తున్నా సంపూర్ణ పేదరిక నిర్మూలణ జరగలేదని, ఆకలి, పేదరికం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో సంక్షేమ పథకాలను పూర్తి స్థాయిలో అందించాలని ఆయన సూచించారు. జనాభా పెరుగుదల, వాతావరణ మార్పులు, వాణిజ్య పంటల వైపు మొగ్గు చూపడం వంటి కారణాలతో పేదరికం పెరుగుతోందని, నగరాల్లో ఆహారం వృథా అవుతుంటే, కొందరు ఆకలితో అలమటిస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పోషకాహార లోపం వల్ల పిల్లల ఎదుగుదలలో సమస్యలు తలెత్తుతున్నాయని, మేధావులు, ప్రభుత్వాలు, స్వచ్ఛంద సంస్థలు కలిసి పేదరికాన్ని నిర్మూలించాలని ఆయన వేడుకున్నారు.

సంబంధిత పోస్ట్