రాజా రామ్మోహన్ రాయ్ సేవలు చిరస్మరణీయం

నంద్యాల జిల్లా డోన్ పట్టణంలోని బాలికల బీసీ హాస్టల్లో సామాజిక కార్యకర్త డోన్ పి. మహమ్మద్ రఫి ఆధ్వర్యంలో, వార్డెన్ కె. సువర్ణ అధ్యక్షతన రాజా రామ్మోహన్ రాయ్ వర్థంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. విద్యార్థులకు వాతావరణ కాలుష్యం, ఆరోగ్యం వంటి అంశాలపై అవగాహన కల్పించారు. ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించి, మొక్కలు నాటి పర్యావరణాన్ని పరిరక్షించాలని మహమ్మద్ రఫి సూచించారు. రాజా రామ్మోహన్ రాయ్ సేవలు చిరస్మరణీయమని కొనియాడారు.

సంబంధిత పోస్ట్

✕
✕