నంద్యాల జిల్లా డోన్ పట్టణంలోని జెడ్ పి హెచ్ హై స్కూల్ లో సామాజిక కార్యకర్త పి. మహమ్మద్ రఫి ఆధ్వర్యంలో శనివారం స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివస్ పై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించి వాతావరణ కాలుష్యాన్ని నివారించాలని రఫి విద్యార్థులకు సూచించారు. విద్యార్థులతో స్వచ్ఛ ఆంధ్ర ప్రతిజ్ఞ చేయించి, మొక్కలు నాటాలని ప్రోత్సహించారు.