డోన్ పట్టణంలో హోమియోపతి పితామహుడు శామ్యూల్ హానిమన్ వర్థంతి సందర్భంగా సామాజిక కార్యకర్త డోన్ పి. మహమ్మద్ రఫి ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. జర్మనీకి చెందిన డాక్టర్ హానిమన్, ప్రత్యామ్నాయ వైద్యమైన హోమియో విధానాన్ని ప్రపంచానికి పరిచయం చేశారు. 1843 జులై 2న 88 ఏళ్ల వయసులో తుదిశ్వాస విడిచిన ఆయన సేవలను స్మరించుకున్నారు. దేశ స్వాతంత్య్ర సమరయోధులు, శాస్త్రవేత్తలు, సమాజానికి సేవ చేసిన మహనీయులను స్మరించుకుంటూ వారి అడుగుజాడల్లో నడవాలని ఈ సందర్భంగా మహమ్మద్ రఫి కోరారు.