శాస్త్రవేత్త సేవలు చిరస్మరణీయం..రఫి

డోన్ పట్టణంలో సామాజిక కార్యకర్త పి. మహమ్మద్ రఫి ఆధ్వర్యంలో గొప్ప వైద్య శాస్త్రవేత్త, ఆయుర్వేద పండితులు శ్రీ దివి గోపాలాచార్యులు వర్ధంతి, మరియు ఎలక్ట్రో కార్డియోగ్రామ్ (ఇసిజి) ను ఆవిష్కరించిన శాస్త్రవేత్త శ్రీ విల్లెం ఐంతోవెన్   వర్ధంతి సందర్భంగా వారి చిత్రపటాలకు మంగళవారం పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా పి. మహమ్మద్ రఫి మాట్లాడుతూ మన దేశ స్వాతంత్య్ర సమరయోధులను, శాస్త్రవేత్తలను, మహనీయులను, సమాజానికి సేవలు అందించిన ప్రతి ఒక్కరిని స్మరించుకుంటూ వారి అడుగుజాడల్లో నడవాలని తెలిపారు. శాస్త్రవేత్తల సేవలు చిరస్మరణీయమని ఆయన అన్నారు.

సంబంధిత పోస్ట్

✕
✕