కర్నూలు రూరల్ మండలం భూపాల్‌నగర్‌కు చెందిన రఫిక్ (30) గురువారం గుర్తు తెలియని వ్యక్తుల చేతిలో హత్యకు గురయ్యాడు. బర్రెల మేతకు పడిదెంపాడు గ్రామ పొలాల్లోకి వెళ్లిన అతను పొలిమేరలో రక్తపు మడుగులో పడి మృతి చెందినట్టు రైతులు గుర్తించారు. సమాచారం అందుకున్న కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. తండ్రి నబీ సాహేబ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్టు ఎస్సై నరేష్ తెలిపారు.