గోరంట్ల: మొక్కజొన్న మిషన్ లో పడి రైతు మృతి

కోడుమూరు మండలం గోరంట్ల గ్రామంలో విషాద సంఘటన చోటు చేసుకుంది. శుక్రవారం మొక్కజొన్న పంట మిషన్ లో పడి బోయ బెల్లం చిన్న గిడ్డయ్య అనే రైతు మృతి చెందాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం, సొంత పొలంలో మొక్కజొన్న పంటను మిషన్ ద్వారా కోత కోస్తుండగా ప్రమాదవశాత్తు మిషన్ లో ఇరుక్కుపోయాడు. గమనించిన తోటి రైతులు అతి కష్టం మీద చిన్న గిడ్డయ్యను బయటకు తీసి, చికిత్స నిమిత్తం కర్నూలు ప్రభుత్వాస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందినట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్