కోడుమూరు నియోజకవర్గంలోని గూడూరు పంచాయతీ కో-ఆప్షన్ సభ్యుడు, వాల్మీకి సంఘం అధ్యక్షుడు పుట్టపాశం రామాంజనేయులు గురువారం గుండెపోటుతో కన్నుమూశారు. విషయం తెలుసుకున్న కోడుమూరు మాజీ ఎమ్మెల్యే పరిగెల మురళీకృష్ణ గూడూరుకు వెళ్లి ఆయన పార్ధివదేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులతో మాట్లాడారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.