వాహనదారులకు కోడుమూరు సీఐ హెచ్చరిక

వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు తప్పకుండా పాటించాలని కోడుమూరు సీఐ తబ్రేజ్ హెచ్చరించారు. గురువారం సి. బెళగల్ మండల కేంద్రంలో ఎస్సై తిమ్మారెడ్డితో కలిసి సీఐ వాహనాల తనిఖీ చేపట్టారు. రోడ్డు నిబంధనలు పాటించని పది మందిపై కేసు నమోదు చేసి రూ. 4, 500 జరిమానా విధించారు. ట్రాఫిక్ నియమ నిబంధనలు సీఐ ప్రజలకు అవగాహన కల్పించారు. స్టేషన్ లో పెండింగ్ కేసుల వివరాలు, నేరాలు, ఇతర సమస్యలపై ఎస్సైని అడిగి తెలుసుకున్నారు.

సంబంధిత పోస్ట్