గూడూరు మండలం వై. కానాపురం గ్రామంలో పొట్టేళ్ల తలకాయల కోసం బుధవారం ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఒక వర్గం వారు సుంకులమ్మ అమ్మవారి దేవర నిర్వహించిన తర్వాత ఈ ఘర్షణ ప్రారంభమైంది. ఘర్షణ విషయం తెలిసి, గూడూరు ఎస్సై తిమ్మయ్య సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చి, గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. కేసు నమోదు చేసి విచారణ చేపట్టామని ఎస్సై తెలిపారు.