కోడుమూరు: రెండు బైకులు ఢీ.. ఒకరు మృతి, నలుగురికి గాయాలు

కోడుమూరు మండలం వర్కూరు గ్రామ సమీపంలోని పెట్రోల్ బంకు వద్ద రెండు బైకులు ఎదురెదురుగా వచ్చి ఢీకొన్న ప్రమాదంలో ఒక వ్యక్తి మృతి చెందగా, నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికుల సమాచారం మేరకు. మృతుడు వెల్దుర్తి మండలం శ్రీరంగపురంకు చెందిన వెంకటరాముడుగా గుర్తించారు. గాయపడిన అరవింద్, వేణులు వెంకటరాముడు కుమారులు కాగా, షాషావలి, దాదపీరాలు బదినేహాల్ వాసులగా గుర్తించారు. క్షతగాత్రులను కర్నూలుకు తరలించారు.

సంబంధిత పోస్ట్