కర్నూలు జిల్లాలో గురువారం సాయంత్రం నుంచి శుక్రవారం వరకు ఎనిమిది మండలాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిశాయి. వాతావరణ శాఖ అధికారుల తెలిపిన వివరాల ప్రకారం. కల్లూరు, కర్నూలు అర్బన్, రూరల్, కోడుమూరు, ఆదోని ప్రాంతాల్లో వర్షపాతం నమోదై మామిడితోటలకు గాలులతో నష్టం వాటిల్లింది. వాతావరణ శాఖ ప్రకారం రాబోయే రోజుల్లో కూడా తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉందన్నారు.