కర్నూలు జిల్లాలో జరిగిన రోడ్డుప్రమాదంలో ఓ మహిళ మృతి చెందింది. మంగళవారం రాజోలికి చెందిన సుగుణమ్మ, భర్త శేఖర్ తో కలిసి ఇంట్లో శుభకార్యం నిమిత్తం ఆటోలో షాపింగ్ కు కర్నూలుకు వచ్చి, తిరిగి రాజోలికి వెళ్తుండగా, వేగంగా వచ్చిన ఇసుక ట్రాక్టర్ ఢీకొనడంతో, ట్రాక్టర్ చక్రానికి ఆమె చీర చిక్కుకుని, ట్రాక్టర్ ఆమెను కొద్ది దూరం వరకు ఈడ్చుకెళ్లింది. భర్త కాపాడే ప్రయత్నం చేసినా ఆమెను రక్షించలేకపోయాడు.