రాబోయే డీఎస్సీ–2026 నోటిఫికేషన్లో రాయలసీమ జిల్లాల్లోని ఉపాధ్యాయ ఖాళీలన్నింటినీ భర్తీ చేయాలని రాయలసీమ రాష్ట్ర సేన వ్యవస్థాపక అధ్యక్షుడు రజాక్ వలి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కర్నూల్ లో మాటాడుతు 2, 500కు పైగా ఉపాధ్యాయ పోస్టులతో డీఎస్సీ నోటిఫికేషన్‌కు ప్రభుత్వం సిద్ధమవుతున్న నేపథ్యంలో రాయలసీమకు న్యాయమైన వాటా కల్పించాలని కోరారు. గత మెగా డీఎస్సీ–2025లో 16, 347 పోస్టుల భర్తీలో రాయలసీమకు అన్యాయం జరిగిందని ఆరోపించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 22, 088 ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉండగా కేవలం 2, 500కు పైగా పోస్టులతో నోటిఫికేషన్ ఇవ్వడం నిరుద్యోగులకు తీవ్ర నిరాశ కలిగిస్తోందన్నారు.