కల్లూరు అడవిలో దారుణం

కర్నూలులో మిస్సింగ్ మిస్టరీ వీడింది. చింతలముని నగర్‌కు చెందిన శ్రీనును అతని స్నేహితుడు మౌలాలి హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. డబ్బుల వివాదంతో పాటు పలుమార్లు కొట్టడంతో ఆగ్రహించిన మౌలాలి, మే 13న శ్రీనును కల్లూరు అడవిలో మద్యం తాగించి హత్య చేశాడు. శ్రీను చివరి కాల్ మౌలాలికే చేయడంతో పోలీసులకు అనుమానం వచ్చి విచారణ చేపట్టారు. అడవిలో శ్రీను మృతదేహం లభించనప్పటికీ, కొంత దూరంలో లభించిన పుర్రెను DNA పరీక్షల కోసం పంపారు.

సంబంధిత పోస్ట్