ఆదోనిలో శనివారం తెల్లవారు జామున మహాయోగి లక్ష్మమ్మ వేర్ హౌస్ సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. బోలేరో వాహనం ముందు వెళ్తున్న ఎద్దులబండిని ఢీకొనడంతో ఓ ఎద్దు అక్కడికక్కడే మృతి చెందగా ఓ వ్యక్తి కాలు విరిగింది. అతన్ని ఆదోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బోలేరో కోసిగికి చెందినది స్థానికులు తెలిపారు.