ఈనెల 17న సీఎం చంద్రబాబు నాయుడు కర్నూలు జిల్లాలో పర్యటించనున్నారు. శుక్రవారం జిల్లా కలెక్టర్ పి. రంజిత్ బాషా, ఏపీ సీఎం ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ పెందుర్తి వెంకటేష్, పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి, జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్, జేసీ నవ్వ సి. క్యాంప్ రైతు బజార్, స్వచ్ఛ ఆంధ్ర పార్క్, ప్రజావేదిక ఏర్పాట్లను పరిశీలించారు. పర్యటనలో అన్ని ఏర్పాట్లు జాగ్రత్తగా నిర్వహించేందుకు సమీక్షలు చేపట్టారు.