మానవత్వాన్ని చాటుకున్న డాక్టర్ శంకర్ శర్మ

దేశ ప్రగతి ఉపాధ్యాయులపై ఆధారపడి ఉంటుందని కర్నూలుకు చెందిన ప్రముఖ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డాక్టర్ శంకర్ శర్మ అన్నారు. కర్నూలు నగరంలోని బుధవారపేట మున్సిపల్ కార్పొరేషన్ ప్రైమరీ స్కూల్ ఆవరణలోని భవిత పాఠశాలలో మానసిక దివ్యాంగ విద్యార్థులకు డాక్టర్ శంకర్ శర్మ పుస్తకాలు, ప్యాడ్స్, విద్యార్థులకు ఉపయోగపడే కిట్లను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. మానసిక దివ్యాంగ విద్యార్థులకు విద్యాబోధన చేయడం ఎంతో ఓర్పుతో కూడుకున్న బాధ్యత అని, అలాంటి విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పుతున్న ప్రత్యేక ఉపాధ్యాయులను అభినందించారు. సామాజిక సేవలో భాగంగా విద్యార్థులకు తనవంతు సహాయం అందిస్తానని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్

✕
✕