రాయలసీమ ముఖ ద్వారమైన కర్నూలు నగరంలో హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడం హర్షనీయమని మాజీ రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్ అన్నారు. కర్నూలు జిల్లాకు హైకోర్టు బెంచ్ ప్రకటించడంతో తెలుగుదేశం పార్టీ లీగల్ సెల్ ఆధ్వర్యంలో బుధవారం మాజీ రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్ ను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా టీజీ వెంకటేష్ మాట్లాడుతూ గత 20 సంవత్సరాలుగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పటి నుంచి కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నామన్నారు.