ఏపీ రాష్ట్రానికి శనివారం ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. కర్నూలు జిల్లాలో ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో 18, 093 మంది మంది పరీక్షలు రాయగా 14, 967 మంది పాసయ్యారు. 83 శాతం పాస్ పర్సంటేజీతో కర్నూలు జిల్లా రాష్ట్రంలోనే 11 వ స్థానంలో నిలిచింది. ఫస్ట్ ఇయర్లో 20, 420 మందికి 14859 మంది పాసయ్యారు. 73 శాతం పాస్ పర్సంటేజీతో 8వ స్థానంలో జిల్లా నిలిచిందని జిల్లా విద్యాశాఖ అధికారులు తెలిపారు.