కర్నూలు: ఉచిత రిటైల్ సేల్స్ శిక్షణకు దరఖాస్తులు ఆహ్వానం

కర్నూలు జిల్లా ఉపాధి, శిక్షణ శాఖ ఆధ్వర్యంలో రిటైల్ సేల్స్ అసోసియేట్ కోర్సుకు ఉచిత శిక్షణ ఇవ్వనున్నారు. 30 మంది అభ్యర్థులకు ఈ అవకాశం లభిస్తుంది. పదవ తరగతి ఉత్తీర్ణులై, 18–30 సంవత్సరాల వయస్సులో ఉన్నవారు జూన్ 20లోపు నగరంలోని సి. క్యాంపు జిల్లా ఉపాధి కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని బుధవారం జిల్లా ఉపాధి అధికారి పి. సోమశివారెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. వివరాలకు 9160563815 ను సంప్రదించవచ్చని సూచించారు.

సంబంధిత పోస్ట్