కర్నూలు: ఆటో-బైక్ ఢీ.. వ్యక్తి మృతి

కర్నూలు నగరంలోని కోడుమూరు రహదారి వై జంక్షన్ వద్ద మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. స్థానికుల సమాచారం మేరకు వీకర్ సెక్షన్ కాలనీకి చెందిన మహేశ్వరరెడ్డి (44) బైక్‌పై వస్తుండగా, అతివేగంగా వచ్చిన ఆటో అతడి బైకును ఢీకొట్టింది. అనంతరం అదేరోడ్డులో ఉన్న ట్రాలీ ఆటోతో పాటు నిలిచి ఉన్న మరో ఆటోను ఢీకొట్టింది. ఈ ఘటనలో తీవ్ర గాయాలపాలైన మహేశ్వరరెడ్డి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు.

సంబంధిత పోస్ట్