కర్నూలు: తుంగభద్రలో గుర్తు తెలియని మహిళ మృతదేహం లభ్యం

కర్నూలు నగరంలోని రోజా వీధి శివారులో తుంగభద్ర నదిలో గుర్తు తెలియని మహిళ మృతదేహం బయటపడింది. శుక్రవారం రెండో పట్టణ సీఐ నాగరాజరావు తెలిపిన వివరాల ప్రకారం. ఆమె చేతిపై "సూరయ్య రేణుక" అనే పచ్చబొట్టు ఉంది. ఎర్రటి పూల పంజాబీ డ్రెస్, నల్లటి లోయర్ ధరించి ఉంది. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం మార్చురీకి తరలించారు. సమాచారం తెలిసినవారు 9121101060కు ఫోన్ చేయాలని పోలీసులు కోరారు.

సంబంధిత పోస్ట్