కర్నూలులో ట్రాఫిక్ నియమాలు ఉల్లంఘించి, మద్యం సేవించి వాహనాలు నడిపిన వారికి ట్రాఫిక్ పోలీసులు చుక్కలు చూపించారు. మంగళవారం డ్రంకన్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడిన 14 మందిని జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టులో హాజరు పరచగా, మెజిస్ట్రేట్ ఒక్కొక్కరికి రూ.10,000 చొప్పున జరిమానా విధించారు. మొత్తం రూ.1,40,000 జరిమానా వసూలైనట్టు కర్నూల్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ సీఐ ఎస్. మాన్సురుద్దీన్ తెలిపారు.