నేర ప్రవృత్తిని నియంత్రించడంపై కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశాల మేరకు ఆదివారం కర్నూలు జిల్లాలోని అన్ని పోలీసు స్టేషన్లలో పోలీసులు రౌడీ షీటర్లకు, నేరచరిత్ర గలవారికి, చెడు నడత కలిగిన వారికి కౌన్సిలింగ్ నిర్వహించారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు దూరంగా ఉండి, సత్ప్రవర్తనతో జీవించాలని సూచించారు. చట్ట విరుద్ధ చర్యలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.