కుటుంబ అవసరాల కోసం రూ.48 లక్షలు అప్పు తీసుకుని, వాటి ఈఎంఐలు కట్టలేక మనస్తాపానికి గురైన శేషేంద్రనాథ్ (48) పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. కర్నూలు కలెక్టర్ కార్యాలయంలో పశుసంవర్ధక శాఖలో సీనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నారు. పసుపుల గ్రామ పంచాయతీ పరిధిలో నివాసముంటున్న ఆయన శుక్రవారం సాయంత్రం విషం తాగారు. చికిత్స పొందుతూ మృతిచెందారు.