కర్నూలు నగరంలోని స్థానిక పార్థసారథి నగర్‌లో చోరీ జరిగింది. కుటుంబంతో కలిసి ఊరికి వెళ్లిన రాంగోపాల్ సోమవారం ఇంటికి తిరిగొచ్చేసరికి తలుపులు తెరిచి ఉండటంతో షాక్ అయ్యాడు. ఇంట్లో ఉన్న ఆరు తులాల బంగారు, 50 తులాల వెండి నగలు చోరీకి గురయ్యాయని గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు త్రీ టౌన్ పోలీసులు తెలిపారు.