రాష్ట్రంలో నారా వారి పాలనలో నరబలి జరుగుతుందని కర్నూలులో వైసీపీ మహిళ విభాగం నాయకురాలు మండిపడ్డారు. మంగళవారం కర్నూలులో వారు నిరసన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వానికి మద్యం అమ్మకాలపై ఉన్న శ్రద్ధ మహిళల రక్షణపై లేదని మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి, మహిళా విభాగం కర్నూలు జిల్లా అధ్యక్షురాలు శశికళ విమర్శించారు. బిఆర్ అంబేడ్కర్ విగ్రహానికి వినతిపత్రాన్ని అందజేసి కూటమి ప్రభుత్వంపై నిరసన వ్యక్తం చేశారు.