కర్నూలు: యాపిల్ ఫోన్ అప్పు తీర్చలేక వ్యక్తి ఆత్మహత్య

విషగుళికలు మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన రహీంఖాన్ (39) అనే వ్యక్తి చికిత్స పొందుతూ గురువారం మృతిచెందాడు. కర్నూలు అబ్బాస్ నగర్‌లో నివసిస్తున్న రహీంఖాన్, బళ్లారి చౌరస్తా సమీపంలో మెకానిక్‌గా పనిచేస్తున్నాడు. 7 నెలల క్రితం యాపిల్ ఫోన్ కొనుగోలుకు అప్పు చేసి, ఆ అప్పు చెల్లించలేక మదనపడి, ఈనెల 4న ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. కుటుంబ సభ్యులకు ఆసుపత్రికి తరలించగా, చికిత్సలో కోలుకోలేక మృతి చెందాడు.

సంబంధిత పోస్ట్