కర్నూలు శివారులోని సుంకేసుల రోడ్డులో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగి షేక్ మహమ్మద్ బాషా మృతి చెందాడు. స్థానికుల సమాచారం మేరకు బీసీ స్టడీ సర్కిల్ కార్యాలయంలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగి మహమ్మద్ ద్విచక్ర వాహనంపై వస్తుండగా కుక్కను తప్పించబోయి డివైడర్‌ను ఢీకొనడంతో తలకు గాయాలై అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.