మీడియా సంస్థల యాజమాన్యం ఒకసారి వారి పనితీరుపై ఆత్మపరిశీలన చేసుకోవాలని వైఎస్సార్సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి మద్దూరు సుభాష్ చంద్రబోస్ ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం కర్నూలులో ఆయన మాట్లాడుతూ ప్రజల పక్షాన పని చేస్తారా, లేక చంద్రబాబు అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా ఆయనకు తొత్తులుగా పనిచేస్తూ ఉంటారా అని ప్రశ్నించారు. జగన్ పై తప్పుడు ప్రచారం తక్షణమే నిలిపివేయాలని సూచించారు.